ETV Bharat / state

బీ కేర్​ఫుల్​ : మీది ప్రేమా? ఆకర్షణా??

author img

By

Published : Feb 14, 2023, 8:00 AM IST

ప్రేమ ఒక ఇంద్రజాలం. మనిషి జీవితంలో ఏదొక దశలో ఈ అనుభూతిని పొందే ఉంటాడు. కొందరికి ఇది అమృతాన్ని పంచితే.. మరికొందరికి విషాదాన్ని మిగుల్చుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ నిప్పులాంటిది. తేడా వస్తే నీతో పాటు నీ వాళ్లను నిలువెల్లా దహించివేస్తోంది. అందుకే నిప్పుతో చెలగాటం ఎంత ప్రమాదమో.. ప్రేమతో (మనసు)తో ఆటలు అంతే ప్రమాదం. సంతోషంగా ఉన్నప్పుడు మన కంటికి అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా చిన్న తప్పటడుగు పడినప్పుడు నీవు పడిపోయిన లోతెంతో తెలిసొస్తుంది. అందుకే నీ మనసుతో పాటు నీ మనసులోకి వచ్చే మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

Valentines Day
Valentines Day

ముఖం చూడగానే ప్రేమ పుడుతుంది కానీ అవతలి వారు ఎలాంటోళ్లో ఎలా చెప్పగలం అనే ప్రశ్న రావొచ్చు. ముఖం చూడగానే ప్రేమలో పడిపోయి గుడ్డిగా ముందుకు వెళ్లిపోలేము కదా. కావాల్సిన వస్తువునే అన్నీ పరిశీలించి తీసుకునే మనం.. మనం జీవితాంతం గడపాల్సిన వారిని ఎంచుకునే విషయంలో పొరపాటు చేస్తే దాని ఫలితం మనతో పాటు మనవాళ్లు జీవితాలు. అందుకే మీది ప్రేమా, ఆకర్షణా పక్కాగా తెలుసుకోండి ఇలా..

మీ ప్రేమ ఎలా మొదలైంది: మొదట మీ ప్రేమ ఎలా మొదలైందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. మీ ప్రయాణంలో ఎదురైన ఒక్కో మలుపు.. ఆసందర్భంలో మీరు, మీ భాగస్వామి స్పందించిన విధానం.. తీసుకున్న నిర్ణయాలను పరిశీలించండి.

తన స్నేహితుల వద్ద మీగురించి ఏమి చెబుతున్నారు: చాలా మంది తన మనసును స్నేహితుల ముందు కచ్చితంగా బహిర్గతం చేస్తారు. ఏదొక సమయంలో మీ ప్రస్తావన వచ్చే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీ గురించి ఏవిధంగా చెబుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. అలాగని వాళ్లు వీళ్లు చెప్పినవి గుడ్డిగా నమ్మేయడం కూడా చాలా ప్రమాదం.

మీకు వెచ్చించే సమయం: ప్రేమలో పడిన కొత్తలో మన భాగస్వామి మనతో ఎక్కువ సేపు మాట్లాడడం, గడపడం చేస్తారు. కానీ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆ రిలేషన్​లో ఏమైనా మార్పులు వస్తున్నాయోమో గమనించండి. ఏదైనా చెప్పినప్పుడు దాటవేయడం, అధికంగా అబద్దాలు చెప్పడం లాంటివి జరుగుతున్నాయోమో గమనించండి.

చేసే వాగ్దానాలు: ప్రేమలో ఉన్నప్పుడు మన పార్ట్​నర్​కి మనవల్ల ఏదైనా కాస్త అసౌకర్యం కలిగినా.. కోపం కలగడానికి కారణం అయినా వాగ్దానాలు చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో మీతో రిలేషన్​లో ఉన్నవారు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారు. అవి నెరవేరేవేనా వంటి వాటిని ఓసారి బేరీజు వేసుకోండి. ఎందుకంటే మాటలతో మేడలు కట్టగలం.. కానీ నిజ జీవితంలో చెప్పినవి చాలా నెరవేర్చలేము.

మీవద్ద చెప్పిన అబద్ధాలు: మనిషి జీవితంలో అబద్ధం చెప్పలేనివారు అంటూ ఎవరూ లేరు. ప్రధానంగా ప్రేమలో ఉన్నవారు వీటిని చాలా సందర్భాల్లో ఉపయోగించే ఉంటారు. కానీ చెప్పిన అబద్ధం వల్ల ఎదురయ్యే ప్రతిఫలం మీ బంధాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. మీరు చెప్పేది అబద్ధమని.. దానివల్ల అవతలి వ్యక్తికి తీవ్ర నష్టం జరుగుతుందని అవతలి వారికి తెలిసినప్పుడు మీ బంధం నిలవదు. కత్తికంటే పదునైన మాటను జాగ్రత్తగా పరిశీలించండి. ఆకర్షణలో ఇలాంటి అబద్ధాలకు కొదవే ఉండదు. మాటల్లోనే మీరు అవతలి వారిని అంచనా వేయవచ్చు.

తన ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలు: ప్రేమిస్తున్నామంటే ఏదో గుడ్డిగా నమ్మేయకండి. అవతలి వారి కుటుంబ, వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఏదో సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు, చూడడానికి బాగుంటారు. అనుకుని ముందుకు వెళ్లిపోతే బొక్కబోర్లా పడడం ఖాయం.

సమస్య వచ్చినప్పుడు ప్రవర్తన: ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు, సమస్య వచ్చినప్పుడు మీతో రిలేషన్​లో ఉన్నవారి ప్రవర్తన అంచనా వేయండి. మీకు తోడుగా ఉంటున్నారా. లేదా తను పక్కకు జరిగి అందులోకి మిమ్మల్ని నెడుతున్నారా గమనించండి. విషయపరిజ్ఞానంతో పాటు, సమస్యను ఎలా ఫేస్ చేస్తున్నారో చూడండి.

వ్యక్తిగత ప్రవర్తన: మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్న సమయంలో అవతలి వ్యక్తి ప్రవర్తన, మాటతీరు ఏవిధంగా ఉంటుందో గమనించండి. ఆకర్షణలో ఉన్నవాళ్లు ఎక్కువశాతం ఈ సందర్భంలోనే బయటపడిపోతారు.

తన ఆహారపు అలవాట్లు, ఖర్చుల విషయాలు: మీరు ప్రేమించే వ్యక్తి ఆహారపు అలవాట్లు, ఆర్థిక పరమైన విషయాల్లో వారి ప్రవర్తన గురించి ఓ కన్నేయండి. ఎందుకంటే ప్రేమంటే కొంతకాలం ఉండిపోయే రుతువులాంటిది కాదు కదా.. అవతలి వాళ్ల జీవితాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడం తప్పుకాదు.. అలాగని మీ బంధం డబ్బుచుట్టూ తిరగకూడదు.. అలాంటి వారి మధ్య ప్రేమే ఉండదు.

చివరిగా ఒక్కమాట: మన ఫ్రెండ్స్​కి లవర్ ఉన్నారు. మనకి లేరనో.. బైక్​పై జంటగా తిరిగితే ఆ మజాయే వేరనో.. లేదంటే సినిమాల్లో చూసినట్టు మనం కూడా ఉండాలనో.. లేదంటే ఏదొక రాయి వేద్దాం.. పడితే కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దాం.. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకోవచ్చు. లేదంటే బ్రేకప్ చెప్పేద్దామనో ఇలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి విరమించుకోవాలి.. ఎందుకంటే ప్రేమ మనసుకు సంబంధించినది. అవతలి వారు మిమ్మల్ని ప్రాణంకంటే ఎక్కువగా భావిస్తే.. వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. అందుకే మనసుతో ఆడుకోకూడదు.

ఈ ప్రశ్నలు మిమ్మల్ని పరీక్ష పెట్టినా మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకంటే రేపు మీకు ఎదురయ్యే పరిస్థితులకు మీరే సమాధానం చెప్పుకోవాలి కనుక.

ఇవీ చదవండి: ప్రేమించాలంటే ఈ లక్షణాలు ఉండాలి.. మరి మీలో ఉన్నాయా..?

Kiss Day : నాలుగు పెదాలు.. రెండు మనసులు.. ఓ సంగమం!

Hug day : దేహంతో కాదు.. మనసుతో తనువును బంధించాలోయ్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.