Mahila Congress meet: మహిళా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన సమావేశంలో ఇద్దరు మహిళా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవిత, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మధ్య ఫేక్ బుక్ ఫొటో గొడవకు కారణమైంది. దీంతో హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మరో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల మహిళా అధ్యక్షులు నిలబడి ఉండగా.. నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత కూర్చుని ఉన్న ఫొటోలు ఫేస్బుక్లో షేర్ కావడంపై రెండు జిల్లాల మహిళా అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత తన ఫేక్బుక్లో ఉన్న ఫొటోలు తొలగించి మిగతా నేతలకు క్షమాపణలు చెప్పాలని సునీతారావు డిమాండ్ చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా మిగిలిన వారిని అసభ్యంగా దూషిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు బయటకు వెళ్లిపోయారు.
ఇవీ చూడండి: రామాయంపేటలో ఉద్రిక్తత... మృతదేహాల తరలింపు సమయంలో ఘర్షణ
లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చెప్పు దెబ్బలు కొట్టిన మహిళా సిబ్బంది