సుదీర్ఘకాలంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. గత 14 ఏళ్లుగా గ్రామ స్థాయిలో సేవలందిస్తున్న తమ పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహారించాలని కోరారు.
గతంలో ఇచ్చిన 4779 సర్క్యులర్‌ను రద్దు చేసి...తమ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని 18 వేలకు పెంచాలని... పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రవి కోరారు. సీఎం కేసీఆర్ తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి... క్షేత్ర సహాయకుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సమావేశంలో విన్నవించారు.