Festival at Andhra Odisha Border Region: సాధారణంగా పండుగ అంటే బంధువులు ఇంటికి రావడం.. విందు భోజనం చేయడం లాంటివి చూస్తాం. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గల మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని ఆంద్రాహాల్ పంచాయతీ కేంద్రంలో ప్రతి ఏడాది జరిగే వింత పండుగ చూపరులను ఆకట్టుకుంటోంది. సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణలో ఎంతో ప్రత్యేకత ఉన్న.. బోండా గిరిజనుల ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఏడాది జనవరి నెలలో జరిగే జట్టి పరబ్ (కొట్టుకునే పండుగ) ప్రత్యేకంగా నిలుస్తుంది.
మొదటగా గ్రామ పూజారి ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి పండుగను ప్రారంభిస్తారు. అనంతరం యువకులంతా వచ్చి కొట్టుకుంటారు. కళ్లు చెట్టు కొమ్మలతో వీపులపై గట్టిగా కొట్టుకుంటారు. ఎటువంటి రాగ ద్వేషాలు.. కక్షలు లేకుండా కేవలం ఆచారం కోసమే ఇలా చేస్తామని వారంతా అంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వీపుల మీద గాయాలకు బంధువులైన మహిళలు పసుపు లేపనం పూస్తారు. కేవలం ఒక గంట జరిగే ఈ పండుగ కోసం గ్రామంలో ఉన్నవారు.. వృత్తి రీత్యా బయట ఉన్న వారూ స్వగ్రామానికి చేరుకుంటారు. పండుగలో భాగంగానే ఇలా చేస్తున్నామని వారు చెప్తుండటంతో పండుగ సర్వత్రా ఆకట్టుకుంటోంది.
ఇవీ చదవండి:
వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు
రూట్ మార్చిన డ్రగ్ డీలర్లు.. మొన్నటిదాకా సౌత్.. ఇవాళ నార్త్పై ఫోకస్