ETV Bharat / state

రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం - rachakonda Police Commissioner felicitation to donars

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాటి మనుషులకు సహాయం చేయడం చాలా అభినందనీయమని సీపీ మహేశ్​ భగవత్ అన్నారు. హైదరాబాద్ నాగోల్​లోని శుభం కన్వెన్షన్ హాల్​లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గుడ్ సమర్టీయన్స్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

felicitation to good Samaritans for services during covid-19 pandemic in subhuman conventional hall nagole
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం
author img

By

Published : May 30, 2020, 11:00 PM IST

Updated : May 30, 2020, 11:37 PM IST

హైదరాబాద్ నాగోల్​లోని శుభం కన్వెన్షన్ హాల్​లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'గుడ్ సమర్టీయన్స్' కార్యక్రమానికి సీపీ మహేశ్​ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్​డౌన్​ కాలంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న సుమారు వందమంది వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు.

విపత్కర పరిస్థితుల్లో సాటి మనుషులకు సహాయం చేయడం చాలా అభినందనీయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సీపీ కొనియాడారు. లాక్​డౌన్ సడలించినప్పటికీ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ.... కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పేద ప్రజలకు చేయూత అందించి... సమాజానికి సేవ చేయడానికి ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పోలీసుశాఖకు దాతలు కృతజ్ఞతలు తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం

ఇదీ చూడండి: త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

Last Updated : May 30, 2020, 11:37 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.