ఆకలి లేని హైదరాబాద్‌ను సాధిద్దాం హైదరాబాద్ బంజారాహిల్స్ నిమ్స్ ఆసుపత్రి వెనుక ద్వారం వద్ద ఆపిల్ ఫ్రిడ్జ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఆపిల్ హోం ఫర్ ఆర్ఫన్కిడ్స్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జంట నగరాల్లోని హోటల్ యజామాన్యాలు, వివాహాది, శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారం వృథా చేయకుండా ఫీడ్ ద నీడ్ కేంద్రంలో పెడితే చాలు.. పేదలు, అన్నార్థులు తీసుకుంటారని ప్రముఖ సినీ నిర్మాత సురేశ్ బాబు అన్నారు.
ఆకలి లేని హైదరాబాద్‌ను సాధిద్దాం
సురక్షిత పద్ధతుల్లో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసి ఎల్లవేళలా ఆకలి తీర్చేలా ఏర్పాట్లు చేయడం శుభపరిణామం. ఆకలి లేని హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటికే రెండు చోట్ల ఫీడ్ ద నీడ్ కేంద్రాలు ప్రారంభించామని ఆపిల్ హోం ఫర్ ఆర్ఫన్స్ కిడ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ నీలిమ ఆర్య అన్నారు. ఆకలితో ఉన్న వారెవరైనా ఈ కేంద్రాలకు వచ్చి ఆహారం ఉచితంగా తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి:అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పరుగులు