జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికైన కార్పొరేటర్లు ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మేయర్ ఎన్నిక అనంతరం ఉపమేయర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది.
ఫిబ్రవరి11న ఎన్నిక జరగని పక్షంలో 12వ తేదీన ఎన్నిక జరపనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కలెక్టర్‌కు ప్రిసైడింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించనుంది. ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షణ పరిశీలకుడిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.
ఇదీ చదవండి: రుణమంతా చెల్లించినా.. వేధింపులు ఆపలేదు: డీసీపీ పద్మజ