భార్య తనను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లిందన్న అక్కసుతో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఓ వ్యక్తి తన కుమార్తెల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. వారిని చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వెలుగు చూడడం వల్ల నిందితుడు పరారయ్యాడు.
ఇదీ జరిగింది...
నర్సాపురం మండలం సారవ గ్రామంలో ఉల్లంపర్తి ఎలిషా, మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జీవనోపాధి కోసం ఇటీవల పిల్లలు, భర్తను వదిలి తల్లి మహాలక్ష్మి గల్ఫ్‌కు వెళ్లింది. భార్య వెళ్లిపోయిందని కోపం పెంచుకున్న ఎలీషా... తన ఇద్దరు కుమార్తెలను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వెలుగు చూశాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీడియోల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: