ETV Bharat / state

కూలీల కొరతతో సన్నకారు రైతుల సతమతం

రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణంతో పాటు కూలీల సమస్య బాగా పెరిగింది. వ్యవసాయ యంత్రాలుంటేనే సేద్యం సాఫీగా సాగే పరిస్థితి నెలకొంది. సన్న, చిన్నకారు రైతులు యంత్రాలను కొనడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాల కొనుగోలుకు బ్యాంకులూ అప్పులివ్వడం లేదు. వ్యవసాయ శాఖ అధ్యయనంలో వెల్లడైన అంశమిది.

farmers-struggles-shortage-of-labour-in-kharif-season
కూలీల కొరతతో సన్నకారు రైతుల సతమతం
author img

By

Published : May 13, 2021, 8:30 AM IST

వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్న కొత్త వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ శాఖ వివరాలు కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాల వినియోగం, అవసరం, లభ్యతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్యయనం చేసి కేంద్రానికి వివరాలు పంపింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయ యంత్రాల కొరతను ప్రస్తావించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు

రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి... కోటీ 41 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది(2020-21)లో 2.12 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది వానాకాలం, యాసంగి కలిపి కోటి 6 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.

  • సాగు విస్తీర్ణం పెరిగే కొద్దీ కూలీల లభ్యత బాగా తగ్గుతోంది. యంత్రాలు అందుబాటులో ఉంటే వేగంగా పనులు పూర్తి కావడంతో పాటు ఖర్చూ తగ్గుతుంది.
  • ట్రాక్టర్లు, యంత్రాలు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఏటా వాటి కిరాయిలను యజమానులు పెంచేస్తున్నారు. 2019-20తో పోలిస్తే 2020-21లో ఎకరా వరి కోత కిరాయి రూ.300 నుంచి 400 దాకా అదనంగా పెంచారు.
  • ప్రతి గ్రామంలో పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ‘యంత్రాల సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేయాలి. తక్కువ ధరలకు యంత్రాలను అద్దెకిస్తే సాగు వ్యయం తగ్గుతుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది.

వాడుకుని తిరిగిచ్చేలా..

రైతులు యంత్రాలను కొనలేకపోతున్నారు. రైతులతో ఉమ్మడిగా సంఘాల ఏర్పాటుతో లేదా సేవా కేంద్రాల ద్వారా వాటిని వినియోగించుకునేలా చేస్తాం. ఏ రైతుకు ఏ రోజు ఏ యంత్రం అవసరముంటే ఆ రోజు వాడుకుని తిరిగిచ్చేస్తారు. దీనివల్ల అందరికీ అధునాతన యంత్రాలను వినియోగించుకునే వీలు కలుగుతుంది.

-జనార్దన్‌రెడ్డి, కమిషనర్‌, వ్యవసాయ శాఖ

ఇదీ చూడండి: 'కరోనా రెండోదశకు స్వీయ తప్పిదాలే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.