కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా... రాష్ట్రంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నాలుగో రోజు నిరవధిక దీక్షలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు.
కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేసిన చట్టాలను... మోదీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కొన్నిరోజులుగా దిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నా... కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అన్నదాతల పట్ల మొండివైఖరి విడనాడాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : వామపక్ష సంఘాలు