తెలంగాణలో యూరియా కొరతకు ప్రభుత్వ విధానాలే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. యూరియా వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై యూరియాను నిలుపుదల చేసి కృత్రిమ కొరత సృష్టించారన్నారు. యూరియాను అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతకు గల కారణాలు అన్వేషించినా.. ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు గుర్తించకపోవడమే ఈ అనుమానాలకు కారణమని తెలిపారు.
ఇదీ చూడండి : ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలపై జీహెచ్ఎంసీ కొరడా