హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వెన్నెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశ్రమంలోని పిల్లలతో కలిసి దత్తాత్రేయ, నైనా జైస్వాల్, బాబుమోహాన్, చింతల రాంచంద్రారెడ్డి గాలిపటాలు ఎగుర వేశారు. పిల్లలకు మిఠాయిలు పంచారు.
రైతుల అభివృద్దే నిజమైన సంక్రాంతి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను తన కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో జరుపుకుంటానని తెలిపారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరగడం బాధాకరమన్నారు. వరంగల్‌లో యువతిపై హత్య ఘటన తనను కలచివేసిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'