గిరిజనుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ.. ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ 12 గంటల దీక్ష చేపట్టారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చేపట్టిన దీక్షకు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 3పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ప్రాథమిక హక్కుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్‌తో ఏటీఎంల వినియోగం 50 శాతం డౌన్!