ETV Bharat / state

ఫేస్​బుక్​ కలిపింది ఆ కుటుంబాన్ని..! - శ్రీకాకుళంలో ఫేస్​బుక్​ కుటుంబం న్యూస్

ఏళ్లుగా.. కన్నవాళ్లకు దూరం. చిన్నప్పుడు తన సోదరుడితో ఆడుకున్న జ్ఞాపకం. పేగుబంధం దగ్గర గడపాల్సిన బాల్యం ఎక్కడో సాగింది. ఆ బాలిక మనసులో జ్ఞాపకాలు ఉన్నా.. మదిలో ఏదో ఓ మూలన కన్నవారిని ఒక్కసారైనా.. కళ్లారా చూసుకోవాలనే తపన. అదే.. ఇప్పుడు తీరబోతోంది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని.. కుటుంబానికి దగ్గర కాబోతోంది. ఇంతకి ఎవరిదీ కథ..?

family met by Facebook in srikakulam news

author img

By

Published : Dec 7, 2019, 9:53 PM IST

చిన్నతనంలోనే ఇంటికి దూరమైన ఓ బాలికను... తల్లికి చేరువ చేసింది ఫేస్‌బుక్‌. కుటుంబానికి దగ్గర అయ్యేందుకు దారి చూపించింది. నాలుగున్నరేళ్ల వయసులో తప్పిపోయిన ఆ బాలిక... 15 ఏళ్ల తర్వాత మళ్లీ రక్త సంబంధీకులతో మాట కలిపింది. తిరిగి చూస్తానో చూడలేనో అనుకున్నవారితో మాట్లాడడం.. ఆమెను భావోద్వేగానికి గురిచేసింది. కన్నతల్లికి దూరమైనా ఇన్నేళ్లు తనను పెంచిన తల్లిని వదిలి వెళ్లాలంటే బాధగా ఉన్నప్పటికీ... పేగుబంధానికి చేరువయ్యే క్షణాల కోసం ఆ బాలిక పరితపిస్తోంది.

చిన్నతనంలోనే..ఇంటికి దూరం

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి కూలి పనులు చేసుకుంటూ ఉండేవారు. అలానే పనుల నిమిత్తం ఓసారి హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలోనే భవానీ అనే బాలిక ఓ ఇంటి వద్ద తప్పిపోయి .. జయరాణికి కనిపించింది. సరే వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించాలని చాలా ప్రయత్నించింది. అయినా ఫలితం శూన్యం. బాలిక గురించి ఎవరైనా వస్తే.. తమ ఇంటికి పంపాలంటూ సనత్​నగర్ పోలీస్ స్టేషన్​కు సమాచారమిచ్చింది.

అప్పటి నుంచి భవానీకి తానే.. అమ్మ అయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్​ నుంచి విజయవాడకు తన ఇద్దరు కూతుళ్లతో సహా భావానీని తీసుకొచ్చింది. పడమటలంకలో జయరాణి.. వంశీ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్​ ఇంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలోనే మెుదటిసారిగా భావానీని వంశీ ఇంటికి తీసుకెళ్లింది. చిన్న వయసు కావడం వల్ల భవానీ వివరాలను వంశీ అడిగారు. తాను చిన్నతనంలోనే ఇంటికి దూరమయ్యానని.. తెలిపింది.

వీడియోకాల్ కలిపింది..!

భవానీ ఇచ్చిన వివరాల ఆధారంగా... మోహన్‌వంశీధర్‌ సామాజిక మాధ్యమాల్లో వివరాల సేకరణ ప్రారంభించారు. కొద్దిసేపటికి శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి నుంచి వచ్చిన ఓ వీడియోకాల్‌లోని వ్యక్తి తన సోదరుడని... భవానీ గుర్తుపట్టింది. అప్పుడే తెలిసింది.. తన తల్లి పేరు వరలక్ష్మీ, తండ్రి పేరు మాధవరావు.

అదే ప్రేమ కావాలి..!

ఫేస్‌బుక్ వీడియోకాల్‌లో తల్లిదండ్రులను గుర్తుపట్టిన భవానీ కుటుంబంతో మాట్లాడింది. ఏళ్లతర్వాత రక్తసంబంధీకులతో మాట్లాడిన భవానీ భావోద్వేగాని గురైంది. పెంచిన తల్లి వద్ద ఇన్నాళ్లూ సుఖంగా ఉన్న బాలిక... రక్తసంబంధీకుల నుంచి అదే ప్రేమను ఆశిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చదవండి: హమ్మయ్యా... ఆకలి తీర్చింది..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.