ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ నకిలీ పోలీసును భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్-19 కారణంగా ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్ పోస్టులను దాటేందుకు ఓ వ్యక్తి సైబరాబాద్ ఎస్ఐగా వేషం కట్టి... పోలీసులకు దొరికిపోయాడు. విజయవాడ శివారు గొల్లపూడి సమీపంలో... భవానిపురం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నకిలీ గుర్తింపు కార్డుతో వెళ్తున్న అతడు.. అడ్డంగా పట్టుబడ్డాడు.
నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్‌గా పోలీసులు... విచారణలో గుర్తించారు. ప్రశాంత్ హైదరాబాదులో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవాడని తెలిపారు. అతడి నుంచి స్విప్ట్ డిజైర్ కారు, నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి : కేటుగాడు.. ఎస్సైనంటూ యువతిని వంచించి పెళ్లి.!