ETV Bharat / state

పాలను వేడిచేస్తే ప్లాస్టిక్​ ముద్దయింది! - పాలను వేడిచేస్తే ప్లాస్టిక్​ ముద్ద వచ్చింది...

"ఉప్పు... పప్పు... పాలు... పిండి... కాదేది కల్తీకి అనర్హం” అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తుండటం వల్ల… వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రజలంతా దసరా పండుగలో నిమగ్నమై ఉంటే పాల వ్యాపారస్తులు నకిలీ పాలను విక్రయిస్తూ బిజీగా ఉన్నారు. పాలను వేడి చేస్తే మీగడ వస్తుంది... కానీ ప్లాస్టిక్​ వచ్చిన  ఘటన హైదరాబాద్​లోని ప్రగతినగర్​లో చోటుచేసుకుంది.

పాలను వేడిచేస్తే ప్లాస్టిక్​ ముద్ద వచ్చింది...
author img

By

Published : Oct 11, 2019, 1:22 AM IST

'కాదేదీ కవితకు అనర్హం' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయితే కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు నేటి కల్తీరాయుళ్లు. ఈ కల్తీరాయుళ్లు పాలను కూడా వదలడం లేదు. పూర్వం పాలలో నీళ్ళుకలిపితే అదో పెద్ద కల్తీగా భావించేవారు. ఇప్పుడు నీళ్ళుకాకుండా ప్రమాదకర రసాయనాలతో 'ప్లాస్టిక్' పాలు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పవన్, సౌమ్య దంపతులు హైదరాబాద్​ నగర శివారు ప్రగతినగర్​లో నివాసం ఉంటున్నారు. పాలవాడు దసరా పండుగకు ఊరికి వెళ్లినందున వారు ఓ మిల్క్​ సెంటర్​ నుంచి పాల ప్యాకెట్లు తీసుకున్నారు. ఒక ప్యాకెట్​లోని పాలను గిన్నెలో పోసి చేయగా పాలు విరిగిపోయి ప్లాస్టిక్ ముద్దలాగా మారిపోయాయి. గిన్నె వల్ల ఇలా అయి ఉండొచ్చని... మరొక ప్యాకెట్ పాలను వేరే గిన్నెలో పోసి వాటిని కాగపెట్టగా ఆ పాలు కూడ ప్లాస్టిక్ ముద్దగా మారటం వల్ల సౌమ్య ఆశ్చర్య పోయి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇదే విషయం మిల్క్ సెంటర్ నిర్వహకుడు నర్సింహను అడగగా అతను దురుసుగా సమాధానం ఇచ్చాడు. చేసేదేమి లేక పవన్ దంపతులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పాలను వేడిచేస్తే ప్లాస్టిక్​ ముద్ద వచ్చింది...

ఇవీ చూడండి: 17 ఏళ్ల బాలికను సజీవదహనం చేసిన ప్రేమోన్మాది

Tg_Hyd_32_10_Nakili Milk_Avb_TS10011 మేడ్చల్ : ప్రగతి నగర్ Anchor: ప్రజలు దసరా పండుగ వేడుకలో బిజీ ఉంటే ఇదే అదునుగా పాల వ్యాపారస్తులు సందట్లొసడేమియా లాగ నకిలీ పాలను విక్రయిస్తున్నారు. Voice: పవన్, సౌమ్య దంపతులు నగర శివారు ప్రగతినగర్ లో నివాసం ఉంటున్నారు. రోజు పాలను ఇంటికి తెచ్చే పాలవాడు దసరా పండుగ కోరకు ఊరికి వెల్లినందున, పాల ప్యాకెట్ కోసం పవన్ ప్రగతినగర్ చౌరస్తా వద్ద నున్న "Sai Teja Milk Centre" లో 2 అర లీటర్ పాల ప్యాకెట్లను కొని తెచ్చి ఇంట్లో ఇవ్వగా.... భార్య సౌమ్య ఒక అర లీటర్ ప్యాకెట్ పాలను గిన్నెలో పోసి స్టౌ పై కాగ పెడుతుండగా పాలు ఒక్కసారిగా విరిగి పోయి ప్లాస్టిక్ ముద్దలాగ మారిపోయాయి..గిన్నె ఫాల్ట్ ఉండొచ్చని మరోక ప్యాకెట్ పాలను వేరే గిన్నెలో పోసి వాటిని కాగపెట్టగా ఆపాలు కూడ ప్లాస్టిక్ ముద్ద గా మారడంతో సౌమ్య ఆశ్చర్య పోయ్యి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇదే విషయం ను మిల్క్ సెంటర్ నిర్వహికుడు Narsimha ను అడగగా అతను దురుసుగా సమాదానం ఇచ్చాడు. ఈ పాలను చిన్న పిల్లలు తాగితే ప్రాణానికే ప్రమాదమని, ఇలాంటి పాలను అమ్మవద్దని చెప్పినా నిర్వహికుడు దురుసుగా మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండని అనడం తో చేసేది లేక పవన్ దంపతులు బాచుపల్లి పియస్ పోలీసులను ఆశ్రయించారు. బాచుపల్లి పియస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Byte: Pavan...బాధితుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.