హైదరాబాద్‌లోని ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను నైజీరియాకు చెందిన ఓ యువతి మూడు నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయం చేసుకుంది. తాను లండన్‌లో ఉంటానని, ఓ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నానని తెలిపింది. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేసేవారంటే మరింత ఇష్టమంది. వాట్సాప్ ద్వారా మాట్లాడుడూ మొదలు పెట్టింది. స్నేహానికి గుర్తుగా బహుమతి రూపంలో ఐ-ఫోన్, ల్యాప్‌టాప్, అమెరికన్ డాలర్లు పంపుతున్నానంటూ నమ్మబలికింది. ఆమె మాటలకు జవాను సంతోషించాడు.
ఈ నేపథ్యంలో దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామంటూ జనాన్‌కు ఫోన్ చేశారు. బహుమతులు ఇంటికి పంపాలంటే సుంకం చెల్లించాలని చెప్పారు. ఆదాయపు పన్ను కట్టాలంటూ కేవలం 15 రోజుల్లో రూ. 12 లక్షలు వసూలు చేశారు. చివరికి బహుమతులు ఇక రావని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించారు. కోల్‌కతా, బీహార్ నగరాల్లోని వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందని గుర్తించారు. వివరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఇదీ చూడండి : బాధ్యతగా కల్లుతాగడమంటే ఇదేనేమో..