Numaish from January 1: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్)ను గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా జనవరి 1న ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం ‘ఈనాడు’కు తెలిపారు. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
20ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో ఆరెకరాల స్థలంలోనే 1500 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన స్థలాన్ని సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. నో మాస్క్.. నో ఎంట్రీ పద్ధతిని అమలు చేస్తామన్నారు. ఎగ్జిబిషన్‌లో రౌండ్ ది క్లాక్ ఫ్రీ వ్యాక్సినేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: new year celebrations : ఆంక్షల నడుమ వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం