ETV Bharat / state

కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ.. ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం ఎంతో తెలుసా?

Excise Revenue: రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం ఈ ఆర్థిక ఏడాది 30వేల కోట్లు మార్క్‌ను దాటనుంది. ఫిబ్రవరి వరకు 11 నెలల్లో రూ.27,962 కోట్లు రాబడి రావడంతో మార్చి నెలలో మరో రెండున్నర వేల కోట్లకుపైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక ఏడాది మరో 5 వేల కోట్లు అదనంగా రూ.35వేల కోట్లకుపైగా ఆదాయం పెరుగుతుందని బడ్జెట్‌ అంచనాల్లో వెల్లడించింది.

కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ.. ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం ఎంతో తెలుసా?
కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ.. ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం ఎంతో తెలుసా?
author img

By

Published : Mar 18, 2022, 7:08 PM IST

Excise Revenue: రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి తరువాత అత్యధికంగా ఆదాయం తెచ్చి పెట్టేది అబ్కారీ శాఖనే. ఎక్సైజ్‌ శాఖ నుంచి వచ్చే ఆదాయం ఏటికేడు పెరుగుతూనే వస్తోంది. మద్యం తయారీదారులకు, విక్రయదారులకు ఇద్దరికి కలిసి రూపాయిలో 35పైసలు పోగా మిగిలిన 65పైసలు ప్రభుత్వ ఖజానాకు జమవుతుంది. మద్యం డిస్టిలరీలల్లో తయారైనప్పుడు ఎక్సైజ్‌ శాఖ సుంకాన్ని విధిస్తుంది. ఆ తరువాత మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరిగినప్పుడు దానిపై వ్యాట్‌ వసూలు చేస్తుంది. ఇవి కాకుండా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్‌లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించిన ఫీజు చెల్లించి లైసెన్స్‌ తెచ్చుకోవాల్సి వస్తుంది. వీటితోపాటు శాఖాపరంగా వివిధ రకాల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది.

గత ఆర్థిక ఏడాదిలో..

అలా 2020-21 ఆర్థిక ఏడాదిలో ఎక్సైజ్‌ డ్యూటీ, లైసెన్స్‌ ఫీజు, అపరాధ రుసుంలు, సీజ్‌ వాహనాల విక్రయాల ద్వారా వచ్చే సొమ్ము, ఆలస్య రుసుం, ధరఖాస్తు రుసుం ఇలా రకరకాల ఆదాయాల ద్వారా రూ.14,369.83 కోట్లు రాబడి వచ్చింది. అదే విధంగా మద్యం విక్రయాలపై వ్యాట్‌ ద్వారా రూ.11,705 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే మొత్తం కలిపి గత ఆర్థిక ఏడాదిలో రూ. 26,074.83 కోట్లు రాబడి వచ్చినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో 30 వేల కోట్ల మార్క్​!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన 11 నెలల వరకు అంటే ఫిబ్రవరి నెల వరకు వచ్చిన ఆదాయం ఏకంగా రూ.27,962.27 కోట్లుగా ఉంది. కేవలం 11 నెలల్లోనే గత ఆర్థిక ఏడాదిలో వచ్చిన మొత్తం కంటే దాదాపు రెండువేల కోట్లు అధికంగా వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రాబడుల్లో ఎక్సైజ్‌ సుంకంతోపాటు వివిధ రూపాలల్లో 11 నెలల్లో వచ్చిన ఆదాయం రూ 15,647.06 కోట్లుగా ఉంది. అదే విధంగా మద్యం అమ్మకాల ద్వారా విలువ ఆధారిత పన్ను-వ్యాట్‌ కింద రూ.12,315.21 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన మొత్తాన్ని నెలవారీగా వచ్చిన సగటున ఆదాయం రెండున్నరవేల కోట్లకుపైగా ఉంది. ఇదే విధంగా ఇప్పుడు జరుగుతున్న మార్చి నెలలో మరో రెండున్నర వేల కోట్లు ఆదాయం రావడం ఖాయమని అంచనా వేస్తున్న అధికారులు ఈ ఆర్థిక ఏడాది 30వేల కోట్లు మార్కును అబ్కారీ శాఖ ఆదాయం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు

వచ్చే ఆర్థిక ఏడాది మరో అయిదువేల కోట్లు అదనంగా 35వేల కోట్లకుపైగా ఆదాయం పెరుగుతుందని బడ్జెట్‌ అంచనాల్లో ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.