ETV Bharat / state

మద్యం విక్రయిస్తూ కనపడితే కఠిన చర్యలే: మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - మద్యం అమ్మకాలు

లాక్‌డౌన్‌ వేళ మద్యం అమ్మడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని.. వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వెల్లడించారు. ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

Breaking News
author img

By

Published : Apr 14, 2020, 5:15 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మద్యాన్ని విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్షించారు. మద్యాన్ని అక్రమంగా తరలించి.. ఎక్కువ ధరలకు అమ్మడంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి లైసెన్స్‌ల రద్దు, భారీ జరిమానాలు విధించాలన్నారు.

మద్యం, కల్లు దొరక్క మొదట్లో రోజుకు 140 నుంచి 150 మంది వ్యసనపరులు ఎర్రగడ్డ ఆస్పత్రికి వచ్చేవారని... ప్రస్తుతం రోజుకు రెండు, మూడు కేసులు కూడా రావడం లేదని అధికారులు మంత్రికి తెలియచేశారు. మద్యం దుకాణాలపై వస్తున్న ఫిర్యాదులపై.. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం విచారణ చేస్తుందని మంత్రి తెలిపారు. చంపాపేటలో కూలీలకు మద్యం పంపిణీ చేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

మద్యం విక్రయిస్తూ కనపడితే కఠిన చర్యలే: మంత్రి శ్రీనివాస్​గౌడ్​

ఇదీచదవండి ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.