ETV Bharat / state

Radisson Blu Pub: రాడిసన్​ పబ్​ కేసులో ట్విస్ట్.. 24 గంటలూ నడుపుకోవచ్చు! - Excise Department on Radisson Blu Pub

Radisson Blu Pub: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. సంచలనంగా మారిన రాడిసన్ బ్లూ పబ్​కు 24 గంటలు నడుపుకునే అనుమతి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్​ వరకు పబ్​కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు.

Radisson Blu Pub
Radisson Blu Pub
author img

By

Published : Apr 3, 2022, 5:39 PM IST

Radisson Blu Pub: హైదరాబాద్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు సెప్టెంబర్ వరకు 24 గంటలు నడుపుకోవడానికి అనుమతి ఉందని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహణకు లైసెన్స్‌ ఫీజు కింద రూ.52,66,700 వసూలు చేయడం... 24 గంటలు బార్‌ నడుపుకోడానికి అదనంగా మరో రూ.14లక్షలు రాడిసన్‌ బ్లూ ప్లాజా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం చెల్లించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. నాలుగు అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్న హోటల్స్‌ 24 గంటలు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు తమకు సమాచారం ఉందని... పోలీసు శాఖ విచారణలో ఏమి తేలుతుంది? ఆ శాఖ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఎక్కడైన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లైసెన్స్‌ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాడిసన్ బార్‌కు చెందిన అన్ని కాగితాలను పరిశీలించినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. పత్రాల వరకు అన్ని సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

Banjara Hills Pub Raid: హైదరాబాద్​లో డ్రగ్స్‌ కలకలం రేగింది. బంజారాహిల్స్‌ రాడిసన్‌ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింట్‌ పబ్‌లో మాదకద్రవ్యాలు బయటపడిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో రాత్రి పబ్‌పై దాడులు నిర్వహించి మత్తుపదార్థాలు పట్టుకున్నారు. పబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సినీనటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉన్నారు. నిహారికకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. అదుపులోకి తీసుకున్నవారందనీ విచారించిన పోలీసులు... వారి వివరాలు సేకరించి వదిలేశారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.