పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి సరికొత్తగా ఎక్సెల్ సివిల్స్ అకాడమీని నిర్వహించనున్నట్టు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల డిసెంబర్ నుంచి మొదటి బ్యాచ్‌ని ప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా ఈ అకాడమీని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం గండిపేటలో ఉన్న ఇంటర్, డిగ్రీ కాలేజీలతో పాటు... సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను నిర్వహించనున్నారు. కేవలం మెరుగైన కోచింగ్ కోసం అత్యధిక ఖర్చులు భరించి సివిల్స్ ఆశయం కోసం యువత దిల్లీ వెళ్తోందని అలాంటి వారికి అందుబాటులో ఉండే ఫీజుల్లో మంచి కోచింగ్‌ని ఎక్సెల్ అందిస్తుందని భువనేశ్వరి పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో ఈ అకాడమీని నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: విత్తనంపై గుత్తాధిపత్యం వద్దు.. కొత్త చట్టం కావాలి!