భాజపా ఒత్తిడికి తలొగ్గి... మంత్రి కేటీఆర్‌కి ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కొడుకుపై ప్రేమతో పదవి ఇవ్వట్లేదని విమర్శించారు. పదవి నుంచి దిగిపోయిన తరువాత కేసులతో భాజపా వేధిస్తే... ప్రజల నుంచి సానుభూతి పొందాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పూజల పేరుతో దేవుళ్లను సైతం మోసం చేస్తున్నారన్నారు.
ఇదీ చూడండి: సీఎంగా కేటీఆర్ బాధ్యతలపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ