ETV Bharat / state

Ex MP Vivek Joins Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ - Ex MP Gaddam Vivek resigned to BJP

Ex MP Vivek
Ex MP Vivek
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 11:43 AM IST

Updated : Nov 1, 2023, 12:48 PM IST

11:34 November 01

Ex MP Vivek Joins Congress : బీజేపీ మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ రాజీనామా

Ex MP Gaddam Vivek resigned to BJP
మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ రాజీనామా లేఖ

Ex MP Vivek Joins Congress : తెలంగాణలో ఎన్నికల కోలాహల కొనసాగుతోంది. ప్రధాన పార్టీల్లో చేరికల జోష్‌ రోజురోజుకు పెరుగుతోంది. వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలను.. తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మేరకు వారితో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు తాజాగా కమలం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది.

Former MP Gaddam Vivek Resigns to BJP : బీజేపీకి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌( Vivek ) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాహుల్‌గాంధీ సమక్షంలో వివేక్ తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు వారికి పార్టీ కండువా కప్పి రాహుల్.. హస్తం పార్టీలోకి ఆహ్వానించారు

Vivek Comments on CM KCR : తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్ఎస్‌ నెరవేర్చలేకపోయిందని.. ఈ ఎన్నికల్లో కేసీఆర్​ను ఎలాగైనా ఓడించేందుకు తాను కాంగ్రెస్​లో చేరానని వివేక్ తెలిపారు. రాష్ట్రంలో.. కేసీఆర్‌ కుటుంబం తమ ఆకాంక్షల మేరకే పని చేస్తోందని.. కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. టికెట్‌ అనేది తనకు అంత ముఖ్యమైన విషయం కాదని.. బీఆర్ఎస్ ఓటమే తన ప్రస్తుత లక్ష్యమని వివేక్‌ స్పష్టం చేశారు.

వివేక్ కాంగ్రెస్​లో చేరడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్ నమ్మారని రేవంత్ అన్నారు. ఆయన చేరికతో.. పార్టీలో బలం మరింత పెరిగిందని చెప్పారు. వివేక్ రాకతో హస్తం పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Revanth Reddy Speech at Kollapur Public Meeting : 'తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కి ఒక్క అవకాశం ఇవ్వండి'

Last Updated : Nov 1, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.