ETV Bharat / state

Ponnam on huzurabad result: 'హుజూరాబాద్‌లో గెలుపు ముమ్మాటికీ భాజపాది కాదు'

హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఫలితాలు తాము ఊహించినట్లుగానే ఉన్నాయని కాంగ్రెస్​ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam on huzurabad result)​ పేర్కొన్నారు. ఈటల విజయాన్ని భాజపా గెలుపుగా బండి సంజయ్​ చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకత్వం(Ponnam on huzurabad result)​ బలపరచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

ex mp ponnam prabhakar
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​
author img

By

Published : Nov 2, 2021, 6:50 PM IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలతో కాంగ్రెస్‌ నాయకత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌(Ponnam on huzurabad result)​ పేర్కొన్నారు. బహిరంగ సభలతో సరిపోతుందని కాంగ్రెస్‌ భావించడం సరికాదని హితవు పలికారు. నియోజకవర్గాల్లో గట్టి నాయకత్వం ఏర్పరుచుకునేందుకు... నాయకుల మధ్యనున్న విభేదాలు పరిష్కరించేందుకు జిల్లాలవారీగా చర్యలు చేపట్టాలని కోరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక(Ponnam on huzurabad result)​ ఫలితాలు తాము ముందు ఊహించినట్లే వచ్చాయని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్‌లో విజయాన్ని భాజపా గెలుపుగా బండి సంజయ్‌ చెప్పుకోవడం దురదృష్టకరమన్న పొన్నం(Ponnam on huzurabad result)​... అది ముమ్మాటికీ ఈటల రాజేందర్‌ గెలుపేనని స్పష్టం చేశారు.

హుజురాబాద్‌ ఫలితంతో కాంగ్రెస్‌ సమీక్షించుకోవాలి: పొన్నం

గత ఎన్నికల్లో భాజపాకు కేవలం 1700 ఓట్లు మాత్రమే వచ్చాయి. మంత్రి వర్గం నుంచి తనను తొలిగించడం అప్రజాస్వామికం అన్న విషయాన్ని ఈటల జనంలోకి తీసుకెళ్లగలిగారు. అందుకే తెరాస ఎత్తుగడలు అక్కడ పని చేయలేదు. భాజపా నాయకులు దుబ్బాకలో పనిచేసిన విధానానికి, హుజూరాబాద్‌లో పనిచేసిన విధానానికి ఎక్కడ పొంతన లేదు. ఈటల గెలవాలన్న ఆలోచన బండి సంజయ్‌లో ఎక్కడా కనిపించలేదు. ఈటల ఎక్కడ కూడా తాను భాజపా అభ్యర్థిగా ప్రచారం చేసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కేసీఆర్‌ అహంకారానికి వ్యతిరేకంగా ఓటేయాలని మాత్రమే ఓటర్లను కోరారు. -పొన్నం ప్రభాకర్​, మాజీ ఎంపీ

గత ఎన్నికల్లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన తమ్ముడు కౌశిక్‌ రెడ్డి పట్ల వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ పార్టీ(Ponnam on huzurabad result)​కి తీవ్ర నష్టం కలిగించిందని పొన్నం అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి వచ్చినా ఇంకెవ్వరు వచ్చినా... ఆ నష్టాన్ని పూర్తి చేసుకోలేకపోయామని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: Bandi sanjay comments: ఈటల గెలుపు.. తెలంగాణలో అధికార మార్పునకు నాంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.