యుపీఏ సర్కారు తెచ్చిన సమాచారహక్కు చట్టాన్ని అటకెక్కించే దిశగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ చట్టం వల్ల ప్రజలకు పారదర్శక పాలన అందించే అవకాశాలున్నాయని, పాలకుల్లో జవాబుదారి తనం పెరుగుతుందని వివరించారు. ఈ చట్టంతోనే నరేంద్రమోదీ, స్మృతి ఇరానీ లాంటి నేతల విద్యార్హతల గురించి ప్రజలు తెలుసుకున్నారన్నారు. పాలనలో లుసుగులు బయటపడతాయనే భయంతోనే మోడీ ప్రభుత్వం ఈ చట్టం నిర్వీర్యానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు వెంటనే మోదీ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ఇదీ చూడండి: వారసత్వ కట్టడాల రక్షణ గందగోళంగా ఉంది: హైకోర్టు