ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరంపైన పెట్టిన శ్రద్ధ.. పాలమూరుపై పెట్టలేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. దక్షిణ తెలంగాణను ఏడారి చేయడానికి సీఎంతో.. సహా అందరూ పూనుకున్నారని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా... ఏపీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందని మండిపడ్డారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల ప్రజలకు అన్యాయం జరిగితే మళ్లీ ఇదే ప్రాంతం నుంచి ఉద్యమాన్ని చేపడుతామని జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఏపీ అక్రమంగా తీసుకుపోతున్న నీళ్లను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 220 టీఎంసీ నీళ్లను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోకుండా వృథా చేస్తుంటే.. ఏపీ 275 టీఎంసీల నీళ్లను నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకుపోతుందని తెలిపారు. గవర్నర్ భాజపా అధ్యక్షురాలిగా వ్యహరిస్తోందంటూ తెరాస ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గవర్నర్ అలా వ్యవహరిస్తే.. రాష్ట్రపతి పాలన వచ్చేదన్నారు. గవర్నర్ తమ విధులను చట్ట ప్రకారం నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!