ETV Bharat / state

మోదీ, కేసీఆర్ మాటల మాంత్రికులే..: రాములు నాయక్​

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దొందూ దొందేనని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ కూడా మాటల మాంత్రికులే తప్పా చేతల మనుషులు కాదని ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా 'నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లే కానీ చేశేవారు కాదు: రాములు నాయక్​

author img

By

Published : May 19, 2020, 4:50 PM IST

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ ఇద్దరూ మాటలు చెప్పేవారే కానీ.. చేతల మనుషులు కాదని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ విమర్శించారు. వారిని క్రికెట్​ బౌలర్స్​తో పోల్చారు. ప్రపంచంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ... సీఎం కేసీఆర్‌ దరిద్రపు రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యతో ఓయూలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి జేఏసీ కన్వీనర్ రవీందర్ నాయక్ కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

"మోదీ, కేసీఆర్​ ఇద్దరూ మాటలు చెప్పేవారే. నిర్మలా సీతారామన్​కు ఎఫ్​ఎం రేడియోగా, మోదీకి షోయబ్​ అక్తర్​గా, కేసీఆర్​కు మలింగగా పేర్లు పెడుతున్నా. దేశం ఒకవైపు పోతుంటే.. మొన్నటివరకు ప్రధాని, కేసీఆర్​ ఒకరినొకరు పొగుడుకున్నారు."

-రాములు నాయక్​, మాజీ ఎమ్మెల్సీ

ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లే కానీ చేశేవారు కాదు: రాములు నాయక్​

ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.