లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న సేవలను భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి కొనియాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వై జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతల పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రాణాలకు తెగించి భాగ్యనగరంలో రాత్రింబవళ్లు రోడ్లను శుభ్రం చేస్తూ... ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్