కరోనా వైరస్ను సీరియస్గా తీసుకోకపోతే భారీ ముప్పు తప్పదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తమకు కరోనా వైరస్ సోకదనుకునే వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాలని కోరారు. దయచేసి కొవిడ్-19ను తేలిగ్గా తీసుకోవద్దని... జాగ్రత్తలు పాటించాలని కోరారు.
లాక్డౌన్లో సంపూర్ణంగా పాల్గొనాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ప్రజలను కోరారు. కరోనాతో చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు.
ఇదీ చూడండి: మాస్క్-19 ఉందా అని అడిగితే... క్వారంటైన్కే!