ETV Bharat / state

ప్రాజెక్డుల్లో అవినీతిపై చర్చకు సిద్ధమేనా... నాగం

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి దీనికి సిద్ధమేనా... అంటూ సవాల్ విసిరారు.

"ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఎక్కడికైనా వచ్చి చర్చిస్తా"
author img

By

Published : Aug 30, 2019, 10:07 PM IST

"ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఎక్కడికైనా వచ్చి చర్చిస్తా"

తనకు గంట సమయం ఇస్తే చాలని, కేసీఆర్‌ అవినీతిని బయట పెడతానని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నూరుశాతం తప్పేనని చెప్పారు. అవగాహన లేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. రాజ్యాంగ పక్రియ ద్వారానే తెలంగాణ వచ్చిందని, దాంట్లో కేసీఆర్‌ పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. అవినీతిపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు రమ్మన్నా, ఎల్బీ స్టేడియానికి రమ్మన్నా వస్తానని చెప్పారు. కేసీఆర్, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు అవినీతి నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

ఇదీ చూడండి : డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు

TG_HYD_65_30_EX_MINI_NAGAM_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. వాడుకోగలరు ()కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై చర్చించేందుకు ఎక్కడైనా సిద్దమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తనకు గంట సమయం ఇస్తే చాలు కేసీఆర్‌ అవినీతిని బయట పెడతానని నాగం జనార్ధన్‌ రెడ్డి గాంధీభవన్‌లో వెల్లడించారు. కాళేశ్వరంలో వంద శాతం తప్పుడుగా డిజైన్‌ చేశారని...అవగాహన లేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ద్వజమెత్తారు. రాజ్యాంగ పక్రియ ద్వారానే తెలంగాణ వచ్చిందని అందులో కేసీఆర్‌ పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలన అసమర్ధ, అవినీతి పాలనకు కేరాఫ్‌ అని వ్యాఖ్యానించారు. అవినీతిపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు రమ్మన్నా వస్తా....ఎల్ బి స్టేడియం రమ్మన్నా...వస్తానన్న జనార్ధన్‌ రెడ్డి ముఖ్యమంత్రి ఇష్టం ఏ స్థలాన్నైనా ఎంచుకున్నా అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు అవినీతి నుంచి తప్పించుకోలేరని...త్వరలో జైలు కూసాలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి కేసీఆర్ అవినీతిపై విమర్శలు పెరిగాయని...త్వరలో కేసీఆర్ పాపం పండుతుందని జోష్యం చెప్పారు. బైట్: నాగం జనార్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.