ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై తీర్పును ఈనెల 30వ తేదీకు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. మచిలీపట్నంలో వైకాపా నాయకుడు మోకా హత్య కేసులో.. నిందితునిగా రాజమండ్రి జైలులో ఉన్న రవీంద్ర బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది.
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి.. వై.లక్ష్మణ్ రావు ఇరుపక్షాల వాదనలు విన్నారు. ప్రభుత్వ న్యాయవాదిగా కల్యాణి, కొల్లు తరఫు న్యాయవాది సిద్ధార్ధ లోద్ర వాదనలు వినిపించారు. మచిలీపట్నంలో వైకాపా నాయకుడు మోకా హత్య కేసులో.. నిందితునిగా రాజమండ్రి జైలులో ఉన్న రవీంద్ర బెయిల్ పిటిషన్పై బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు