ETV Bharat / state

Ex Minister Chandrasekhar Joining in Congress : ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్న మాజీమంత్రి చంద్రశేఖర్‌

Ex Minister Chandrasekhar Joining in Congress : మాజీ మంత్రి చంద్రశేఖర్​ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన... సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​లో చేరతారని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

EX Minister Chandrasekhar Latest News
Minister Chandrasekhar Joined in Congress
author img

By

Published : Aug 13, 2023, 6:13 PM IST

Updated : Aug 13, 2023, 7:10 PM IST

Revanth Reddy Meet Chandrasekhar ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్న మాజీమంత్రి చంద్రశేఖర్‌

Ex Minister Chandrasekhar Joining in Congress : ఈ నెల 18న జరిగే కాంగ్రెస్​ బహిరంగ సభలో కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి చంద్రశేఖర్​ ఆ పార్టీలో చేరనున్నారు. చంద్రశేఖర్ చేరికపై చర్చలు జరిపేందుకు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని మాజీమంత్రి నివాసానికి రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి వెళ్లారు. వారివురు సుమారు అరగంట పాటు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారని రేవంత్ తెలిపారు. ఇందుకు అంగీకరించిన చంద్రశేఖర్... ఈ నెల 18న జరిగే పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారు. ఈ సభలోనే పేదలకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రకటన ఉంటుందని రేవంత్​ రెడ్డి తెలిపారు. చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యం నిర్వహించారని రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు. దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు వారికే పూర్తి యాజమాన్య హక్కు కలిగించాలని చంద్రశేఖర్ సూచించారని.. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలిపారు.

Former Minister Chandrasekhar Resigned from BJP : 'రేవంత్​రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్​లో చేరతా'

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీలకు ఇచ్చిన భూములను కేసీఆర్​ ప్రభుత్వం లాక్కుంటోంది. దళితుల భూములను రకరకాల రూపాల్లో రూ.35లక్షల ఎకరాలు ప్రభుత్వం దోచుకుని.. వేలం వేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు వారికే పూర్తి యాజమాన్య హక్కు కలిగించాలని చంద్రశేఖర్ సూచించారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒక్కటేనని.. ఆ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉంది- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Chandrashekar Reason Of Region BJP : మాజీమంత్రి చంద్రశేఖర్... శనివారం రాత్రి బీజేపీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డికి పంపించారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi Sanjay)​ని మార్పు చేసిన దగ్గర నుంచి.. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు ఇటీవల ఈటల.. చంద్రశేఖర్​ ఇంటికి వెళ్లిన ప్రయోజనం లేకపోయింది. కిషన్​ రెడ్డి పిలిపించుకుని మాట్లాడినా చంద్రశేఖర్ మెత్తబడలేదు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.

EX Minister Chandrashekhar Speech about Revanth : కేసీఆర్​ అవినీతి ప్రభుత్వాన్ని ఎదురించడం బీజేపీతో సాధ్యమని నమ్మి.. తన అనుచరులతో బీజేపీలో చేరారని చంద్రశేఖర్​ గతంలో వెల్లడించారు. కేంద్రానికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం లోటుపాటులు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్​ఎస్​కి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సంఘటనలు గమనించి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నరని ప్రకటించారు. అదే సమయంలో ఆయన రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఆహ్వానం మేరకు కాంగ్రెస్​లో చేరనున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్,​చేవెళ్లలోని ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..!

Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రచార శంఖారావం పూరించిన కాంగ్రెస్.. 'తరిమికొడదాం-తిరగబడదాం' నినాదంతో జనంలోకి

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

Last Updated : Aug 13, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.