ETV Bharat / state

'వామన్​రావు దంపతుల హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు జరగాలి'

author img

By

Published : Feb 27, 2021, 7:53 PM IST

వామన్​రావు దంపతుల హత్యకేసు నిందితులను కఠినంగా శిక్షించాలని ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లాది పవన్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ న్యాయ విచారణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

EWS federation meeting on lawyers  vamanrao couples murder case in baghlingampally in hyderabad
'వామన్​రావు దంపతుల హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు జరగాలి'

న్యాయవాద దంపతుల హత్యలో రాజకీయ, ఆర్థిక పరమైన కోణం ఉందని ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లాది పవన్ కుమార్ ఆరోపించారు. బాధిత కుటుంబానికి రెండు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ న్యాయ విచారణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాద దంపతులను హత్య చేసిన సమయంలో రికార్డు చేసిన వీడియో, ఆడియోలో మూడో వ్యక్తి ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మల్లాది పవన్​ కుమార్​ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. అన్ని సంఘాలను కలుపుకుని న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : హామీల పేరుతో కేసీఆర్​ మోసం: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.