ETV Bharat / state

అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు! - kadapa

అక్కడ నీటి కోసం నెలకు రూ.20 వేలు వెచ్చించాల్సి వస్తోంది. 3 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి వెళ్లాలంటే రూ.150 ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వ్యథ కడపకు కూతవేటు దూరంలోని ఓ పల్లెది. ఆ ఊరేంటి... దాని బాదేంటో.. తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే...

అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!
author img

By

Published : Jul 20, 2019, 1:09 PM IST

అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. కడప జిల్లాలోని పుట్టంపల్లిలో దుర్భర పరిస్థిని నెలకొంది. అక్కడకు వెళ్లాలంటే రాళ్లు తేలిన మట్టిరోడ్డే దిక్కు. ఆ పరిసరాల్లో అత్యధిక పశువులు ఉన్న గ్రామం ఇదే! అక్కడ నివసించే వారు 800 మంది అయితే... పశువులు మాత్రం 900. కానీ ఇప్పుడు పుట్టంపల్లిలో అత్యధిక పశువులు ఉండే గ్రామం ఒకప్పుడు ఉండేది అని చదువుకొనే పరిస్థితి ఎంతో దూరంలో లేదు. తాగడానికే నీరు లేని ఆ పల్లెలో పశువులను పోషణ భారమవుతోంది.

కరువు అంచున....
వర్షాభావ పరిస్థితులు పుట్టంపల్లికి శాపంగా మారాయి. ఏడాది నుంచి సరైన వర్షాల్లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీరు లేక చెరువులన్నీ ఎండిపోయాయి. భూములన్నీ దాహంతో నోళ్లు తెరిచాయి. అక్కడి కరవు పరిస్థితి సగటు మనిషికి కన్నీరు తెప్పిస్తోంది. ఒకప్పుడు సంతోషంతో ఉన్న ప్రజలు నేడు... అనుక్షణం ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు.

నీటికి నెలకు రూ.20 వేలు...
అక్కడి ప్రజలు నీటికి నెలకు రూ.20 వేలు ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న బోరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అయితే... దీని కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక 3 కిలోమీటర్లు ఉన్న కడపకు వెళ్లాలంటే... వందలు ఖర్చు చేస్తున్నామని వాపోతున్నారు. రోడ్డును చూసి ఆటోవాళ్లు వెనకడుగు వేస్తున్నారని... రూ.150 చెల్లిస్తేనే గ్రామానికి వస్తున్నారని చెబుతున్నారు.

150 ఏళ్ల చరిత్ర కలిగి పుట్టంపల్లి కరవు అంచున కాలం వెళ్లదీస్తోంది. ఒకప్పుడు ఎందరికో దాహం తీర్చిన ఆ పల్లె... ఇప్పుడు చుక్కనీటి కోసం అల్లాడుతోంది. కడపకు కూతవేటు దూరంలో ఇంతటి దుర్భర జీవనం సగటు మనిషిని కదిలిస్తోంది.

ఇదీ చదవండి : కడప రైతులకు శుభవార్త!

Intro:ap_knl_51_19_dharna_ab_AP10055

s.sudhakar, dhone.

గత 20 రోజులుగా కుళాయిలకు త్రాగునీరు రావడంలేదని మున్సిపల్ కార్యాలయాన్ని c.p.i ఆధ్వర్యంలో మహిళలు ముట్టడించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణం లోని చిగురుమాను పేటకు చెందిన మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులను బయటకు పంపించి గేట్ కు తాళాలు వేసి గంటకు పైగా నిరసన తెలిపారు. పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని,స్నానాలకి, బాత్ రూమ్ కు పోవడానికి కూడా ఇబ్బంది కరంగా ఉందని మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు.

బైట్.

ఇ మాంబి.

Body:త్రాగునీటి కోసం ధర్నా

Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.