ఉగ్రవేట
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. పుల్వామా, షోపియాన్లలో వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం ఎనిమింది మందిని మట్టుబెట్టాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
జలహితం
రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కొల్లమద్ది గ్రామంలో ఎగువ మానేరు ఫీడర్ ఛానెల్‌లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు. నర్మాలలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి
ఇంటిని కాల్చేసిన టీవీ
సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం మోతె గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో టీవీ పేలి మంటలు వ్యాపించాయి. వంట గ్యాస్ లీక్ అవడం వల్ల అగ్నిప్రమాద తీవ్రత పెరిగి.. ఇల్లు దగ్ధమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
ఎన్నికల వేడి
దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ ఇలా జరుగుతోంది.
లెక్కలు తేల్చండి
జల్ జీవన్ మిషన్ పథకంలో జరుగుతున్న మోసాలను గుర్తించి తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రజలకు పనులు కల్పిస్తామంటూ కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారంటూ పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లేఖలో ఇలా పేర్కొన్నారు.
వాటితోనే దాడి చేశారా..
తూర్పు లద్ధాఖ్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణలో చైనా సైనికులు.. ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లతో భారత్ భద్రతా బలగాలపై దాడి చేసినట్లు తేలింది. ఈ మేరకు ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా. చైనా చర్యను ఈ విధంగా అభివర్ణించారు.
బొమ్మతో పెళ్లి
ఎవరైనా తనకు కాబోయే భార్య బుట్టబొమ్మలా ఉండాలని కోరుకుంటారు. అంతే గాని బొమ్మని పెళ్లి చేసుకుంటామా... కానీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ఓ యువకుడు బొమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడో తెలుసా..
అప్పుల్లేవ్...
ఆసియాలోనే అతిపెద్ద ధనవంతుడు ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీల జాబితాలోకి చేరింది. జియోలో 25 శాతం వాటాల విక్రయం ద్వారా రూ. 1.16 లక్షల కోట్లు సమీకరించింది. ఈ డీల్ ద్వారా 2021 మార్చి లోపు సంస్థను రుణరహితంగా మారుస్తానన్న ముకేశ్ అంబానీ ఏమి చేశారంటే...
అందులో ఉన్న కిక్కే వేరప్పా
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను స్లెడ్జింగ్ చేయడం ఆస్వాదించానని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అతడు భారత్‌లో అంతగా రాణించిందేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...
మూడు రోజుల ముందు ఏమైంది
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఇందులో సుశాంత్‌కు సంబంధించిన పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే మూడు రోజుల ముందు ఏమి చేశాడో తెలుసా...