బరితెగింపు
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో దారుణం జరిగింది. రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
కరోనా కోరలు
కరోనా పంజాకు రాష్ట్రం విలవిల్లాడుతోంది. గురువారం ఏకంగా 1,213 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారికి మరో ఎనిమిది బలికాగా... మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
ప్రైవేటులో కనిపించని పారదర్శకత
కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలపై పారదర్శకత కనిపించడం లేదు. నిర్ధరణ పరీక్షలకూ నిరీక్షించాల్సి వస్తోంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో నాణ్యత ప్రమాణాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
కొవిడ్ కోరల్లో యువత
కరోనా మహమ్మారి యువతపైన ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకు వృద్ధుల్లోనే ఎక్కువ ముప్పు కనిపించటం వల్ల యువత వైరస్‌ను తేలికగా తీసుకుంటున్నారని, అలా భావిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
ప్రకృతిలో.. తుళ్లింత
చుట్టూ ప్రకృతి సోయగాలు. నడుమ గోదావరి గలగలలు. పచ్చనిగడ్డిలో చెంగుచెంగు మంటూ దూకే జింకలు. పక్షుల కిలకిలలు. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి తీరాన కనిపిస్తున్న సుందర దృశ్యాలను మీరూ ఓ లుక్కేయండి.
పల్లెకు పోదాం చలో చలో..
కరోనా మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజల ఆదాయంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ విధించనున్నట్లు వార్తలు వస్తుండడం మరింత కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడుంటే ఉపాధి లభించదని నగరాన్ని వీడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
ప్రేమకు స్వాగతం
ప్రఖ్యాత చారిత్రక కట్టడాలను జులై 6 నుంచి సందర్శించేందుకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు వీటిని తిలకించవచ్చని తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా?
కరోనా కాలంలో ఆర్థిక అవసరాలకోసం పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అయితే ఈ మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందా? లేదా? అనే విషయాలు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అదేలాగో ఇప్పుడే తెలుసుకోండి.
నేటి నుంచే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి
కరోనా ప్రభావం వల్ల కళకళలాడే ఎఫ్-1 వెలవెలబోయింది.. కానీ బంధనాలు ఛేదించుకుని.. ఆటుపోట్లు తట్టుకుని మళ్లీ మొదలవుతోంది ఫార్ములావన్! శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది. స్పీల్‌బర్గ్ ట్రాక్‌లో రయ్... రయ్‌నే!
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుఝూమున గుండెపాటు రావడం వల్ల మరణించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.