ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @9AM
author img

By

Published : Jun 16, 2020, 8:59 AM IST

ఏం చేద్దాం... ఎలా ముందుకు వెళదాం

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఏ అంశాలను చర్చించనున్నారంటే..

అధికారులతో సమాలోచనలు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశం కానున్నారు. హరితహారం, పల్లె, పట్టణప్రగతి సహా ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

రెండు వారాల్లోనే.. 1.55 లక్షల కరోనా కేసులు

కరోనాను నియంత్రించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలు చేసింది. అయితే జూన్ 8తో అనేక నిబంధనలను సడలించారు. ఈ నేపథ్యంలో రెండువారాల్లోనే 1.55 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. జూన్ ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్.. గత రెండు వారాల్లోనే నాలుగు స్థానాలకు ఎగబాకిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి ఈ విధంగా ఉంది.

ఫలితాలకు వేళాయె..

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, మార్కుల అప్​లోడ్, ఇతర ఫలితాల ప్రక్రియ పూర్తయిందని ఇంటర్​ బోర్డు కార్యదర్శి తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి ప్రకటించనున్నారు. మూల్యాంకనం, మార్కుల అప్​లోడ్, ఇతర ఫలితాల ప్రక్రియ పూర్తయిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇంతకీ ఫలితాలు విడుదల చేసేది ఎప్పుడంటే..

మా పరిధి తేల్చండి

2014లో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటైనా ఇప్పటివరకు బోర్డు పరిధి నిర్ణయం కాలేదు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిన తర్వాతనే ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తాయి. పరిధి, అధికారాలపై అపెక్స్‌ కౌన్సిల్‌లో తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్యబోర్డు కోరింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి దృష్టికి బోర్డు ఛైర్మన్‌ తీసుకెళ్లారు. అసలేమిటీ వ్యవహారమంటే..

ఏపీ బడ్జెట్​ సమావేశాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం శాసనసభకు సమర్పించనున్నారు. మొత్తం రూ.2.30 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఏ అంశాల ప్రాధాన్యంగా బడ్జెట్​ ఉండబోతోందంటే...

ఔషధం వచ్చేస్తోందా..?

కరోనా ఆందోళనలతో భయపడుతూ బతుకుతున్న ప్రజలు, వైరస్ బాధితులకు ఉపశమనం కలిగించేలా.. పరిశోధనాత్మక ఔషధం రెమ్​డెసివిర్ ఔషధం దేశీయ విపణిలోకి జూన్ నెలాఖరుకల్లా రానుంది. ఇందుకు త్వరలో డీసీజీఐ నుంచి అనుమతులు రానున్నాయి. ఇప్పటికే ఈ ఔషధ తయారీకి అయిదు కంపెనీల సన్నాహాలు చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్​ చేయండి.

తూటా పేలింది

జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లాలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. తుర్క్​వాంగమ్​ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి ముష్కరులు కాల్పులు జరిపారు. తర్వాత ఏమైందంటే..

తొలగని సందిగ్ధం

ఐపీఎల్​ను పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలని ఫ్రాంచైజీలు పట్టుబడుతున్నాయి. టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న ప్రచారంపై ఐపీఎల్​ అధికారి ఒకరు స్పందించారు. లీగ్​ను విదేశాల్లో జరపడం వల్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నారంటే..

షూటింగ్​ షురూ..

రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతించిన క్రమంలో 'ఆర్​ఆర్​ఆర్​' కోసం రాజమౌళి ట్రయల్​ షూట్​కు సిద్ధమయ్యారని సమాచారం. రెండు రోజులపాటు గండిపేట లేదా హైదరాబాద్​ శివార్లలోని అల్యూమినియమ్​ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ట్రయల్​ షూట్​ జరగబోతుందని టాలీవుడ్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ షూటింగ్​కు వారిద్దరూ పాల్గోవడం లేదని సమాచారం.. వారెవరో తెలుసా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.