ETV Bharat / state

టాప్​న్యూస్​ 5PM - etv bharat telangana Top news

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

etv bharat telangana Top news
టాప్​న్యూస్​ 5PM
author img

By

Published : Aug 13, 2022, 4:59 PM IST

  • కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయ్యిందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇటీవలే కొవిడ్‌ బారిన పడ్డారు.

  • కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 25మందికి గాయాలు

TSRTC bus accident కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్‌ చేరుకుని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

  • రాష్ట్రంలో వైభవంగా సాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి బోట్స్ క్లబ్ వరకు సాగిన ర్యాలీని ఉత్సవ కమిటీ ఛైర్మన్ కేశవరావు, సీఎస్‌ సోమేశ్ కుమార్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రారంభించారు. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ రాంనగర్‌లో బండారు దత్తాత్రేయ తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివర్ణ పతాకాలను స్థానికులకు పంపిణీ చేశారు.

  • మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన రేడియో

షికాగో అనగానే భారతీయులకు స్వామి వివేకానంద విఖ్యాత ప్రసంగ వేదిక గుర్తుకొస్తుంది. కానీ షికాగో పేరుకు భారత స్వాతంత్య్రోద్యమానికీ విడదీయరాని అనుబంధముంది. దఫదఫాలుగా గుంపుల వద్దకు వెళ్లి చెప్పిందే చెబుతున్న గాంధీజీ పీలగొంతు కష్టాన్ని చూసి గెయిన్‌చంద్‌ మోత్వానే మదిలో పుట్టిందే షికాగో రేడియో స్పీకర్స్‌. స్వాతంత్య్రోద్యమంలో నాయకుల గళాలను సామాన్య ప్రజలకు చేరువ చేయటమేగాకుండా బ్రిటిష్‌పై పోరాటానికి ప్రజల్ని సమాయత్తం చేయటంలో తరంగమై నిలిచిందిది.

  • హర్ ఘర్ తిరంగా అద్భుతమైన కార్యక్రమని కొనియాడిన చంద్రబాబు

Chandrababu about Har Ghar Tiranga హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో నిర్వహించిన అజాదీ కా అమృత్​ మహోత్సవాలల్లో చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హర్ ఘర్ తిరంగా అద్భుతమైన కార్యక్రమం అని బాబు కొనియాడారు. రాబోయే మూడు రోజులు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు.

  • మన జాతీయ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా

AZADI KA AMRIT MAHOTSAV మన జాతీయ గీతం జనగణమనకు సంగీతం సమకూర్చిందెవరో తెలుసా. భారత తోబుట్టువుగా మారిన ఐర్లాండ్​కు చెందిన మానవతావాది మార్గరెట్ కజిన్స్ జనగణమనకు బాణీలు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారత్​కు తోడుగా నిలిచి జైలుకు సైతం వెళ్లారు మార్గరెట్.

  • స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు

రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. గోల్కొండలో పంద్రాగస్టు ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సీఎస్​ సోమేశ్‌కుమార్‌ అధికారులతో కలసి పరిశీలించారు.

  • కశ్మీర్​లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన

World highest railway bridge అందమైన కశ్మీర్‌ లోయలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జితో పర్యాటకంగా హిమాలయ కొండలు మరింత సుందరంగా మారనున్నాయి. ఈ నిర్మాణంతో కశ్మీర్‌ లోయకు అనుసంధానం మరింత సులభం కానుంది. ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తైన ఈ వంతెన విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

  • షారుక్​​ సూపర్‌హిట్‌ను గుర్తు చేసిన లైగర్‌ జోడీ

పక్కా మాస్‌, కమర్షియర్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన 'లైగర్‌' ప్రమోషన్స్‌లో బిజీ, బిజీగా పాల్గొంటున్నారు విజయ్‌ దేవరకొండ , అనన్య పాండే. తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం కోసం ఈ జోడీ గత కొన్నిరోజుల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు కలిసి తిరుగుతున్నారు. తాజాగా ఈ జోడీ బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్​ ఖాన్‌ నటించిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఈ జోడీని చూసిన నెటిజన్లు క్యూట్‌ పెయిర్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ విజయ్‌, అనన్య ఏం చేశారంటే?

  • ప్రభాస్​ స‌లార్ అప్డేట్​ మ‌రో రెండు రోజుల్లో

'కేజీఎఫ్'​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​- రెబల్​స్టార్​ ప్రభాస్​ కాంబినేషన్​లో వస్తున్న 'సలార్'​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్​ రాలేదు. ఈ విష‌యంలో డార్లింగ్ అభిమానులు మేక‌ర్స్‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్​ను మేకర్స్​ ప్ర‌క‌టించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.