మునుగోడు ఉపఎన్నికలు డిసెంబర్‌లో వచ్చే అవకాశం ఉందని మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఆ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు పోయినా పార్టీ శ్రేణులు స్థిరంగా ఉన్నాయని స్పష్టంచేశారు. పార్టీలో ఎలాంటి అలజడి లేదని.... ఉన్నా అంతా సర్దుకు పోతుందంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్‌రెడ్డి ముఖాముఖి..
మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారు. రాజగోపాల్‌రెడ్డి బయటకు పోయినా శ్రేణులు కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుపై కమ్యూనిస్టులు పునరాలోచన చేయాలి. పార్టీలో ఎలాంటి అలజడి లేదు. పార్టీలో కొన్ని విభేదాలున్నా అన్ని సర్దుకుంటాయి. - ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నల్గొండ ఎంపీ
ఇవీ చదవండి:
కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం, వీరుల త్యాగమే నేటి మన స్వాతంత్య్రమన్న రేవంత్
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోదీ పంచసూత్రాలు