ETV Bharat / state

TS Assembly Elections 2023 : 'ఈ దఫా ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలే'

TS Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల సన్నాహకాలను.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు షురూ చేసింది. ఈ దఫా అన్నీ అత్యాధునిక నూతన ఈవీఎంలను వినియోగిస్తామని తెలంగాణ సీఈవో వికాస్​రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

asssembly elections 2023
asssembly elections 2023
author img

By

Published : May 8, 2023, 7:09 AM IST

TS Assembly Elections 2023 : రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం అత్యాధునిక, నూతన ఓటింగ్‌ యంత్రాలను వినియోగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ చెప్పారు. ఇప్పటికే 1,65,685 ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) అందాయన్న ఆయన... రాష్ట్రంలో 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 34,891 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్న సీఈవో వికాస్​రాజ్...​ ఒక పోలింగ్‌ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లు పెరిగే కొద్దీ వాటి సంఖ్యా పెరుగుతుందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కసరత్తు చేపట్టిన నేపథ్యంలో ఆయన 'ఈటీవీ-భారత్​'తో మాట్లాడారు.

'ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. గతంలో రాష్ట్రానికి హైదరాబాద్‌, బెంగళూరులలో తయారైన ఈవీఎంలను కేటాయించేవారు. ఈ దఫా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ తయారు చేసిన ఈవీఎంలనే కేటాయించారు. గతంలో కూడా అత్యాధునిక ఎం-3 యంత్రాలను కొన్నింటిని వినియోగించినప్పటికీ ఈసారి వాటినే పూర్తిస్థాయిలో వినియోగించనున్నాం. 63,120 బ్యాలెట్‌ యూనిట్లు, 49,310 కంట్రోల్‌ యూనిట్లు, 53,255 వీవీప్యాట్స్‌ అందాయి. మరికొన్ని వస్తాయి.' - వికాస్​ రాజ్, తెలంగాణ సీఈవో

Telangana CEO VIkas Raj Interview : ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యేందుకు జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకునే విధానం ఉందని సీఈవో వికాస్​రాజ్ అన్నారు. ఈ కారణంగా జనవరి ఒకటో తేదీ తరవాత పుట్టిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు మరో ఏడాది వేచి ఉండాల్సి వస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాలుగు తేదీలను ప్రామాణికంగా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించిందన్న ఆయన... జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు ఒకటో తేదీలను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగే సందర్భాల్లో తొలి ఓటర్లు ఎక్కువ మంది నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.

12.55 లక్షల మంది ఓటర్లు ఒకే ఫొటోతో ఉన్నారు: జనవరి అయిదో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత మరో నాలుగు లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని తెలంగాణ సీఈవో వికాస్​రాజ్ తెలిపారు. త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే ఫొటోతో ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉన్న ఓటర్లను తొలగించే ప్రక్రియను త్వరలో క్షేత్రస్థాయిలో చేపడతామని పేర్కొన్నారు. 12.55 లక్షల మంది ఓటర్లు ఒకే ఫొటోతో వేరు వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని ఆయన వివరించారు. ఆయా వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట ఒకటికి మించి ఉన్న ఓట్లను తొలగిస్తామని వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.

వచ్చే నెల నుంచి అధికారులకు శిక్షణ: 'ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి వరకు శిక్షణ ఇవ్వాలి. ఏయే దశలో ఎవరెవరికి శిక్షణ ఇవ్వాలన్న అంశంపై ప్రణాళికను తయారు చేసి అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం. త్వరలో అనుమతి వస్తుంది. రాష్ట్ర స్థాయి మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేసేందుకు నిపుణులను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి అనుబంధంగా పని చేసే ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐడీఈఎం)కు కూడా లేఖ రాశాం. తొలుత జిల్లా ఎన్నికల అధికారులతో శిక్షణ ప్రక్రియను ప్రారంభిస్తాం. వచ్చే నెల నుంచి దశలవారీగా అన్ని స్థాయుల వారికి శిక్షణ ఇస్తాం' -వికాస్​రాజ్, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.