ETV Bharat / state

నష్టపోయిన రైతులకు చేయాల్సిందంతా చేస్తాం: మంత్రి నిరంజన్‌రెడ్డి - Minister Niranjan Reddy Speech

అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. చాలా చోట్ల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్న ఆయన... ఆశించిన మేర దిగుబడులు రాకపోవచ్చన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని, నాణ్యత పేరిట పత్తి రైతులకు ఇబ్బంది పెట్టవద్దని సీసీఐని కోరినట్లు మంత్రి చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన కేంద్రం నుంచి ఉలుకూ, పలుకూ లేదని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ETV bharat interview with Niranjan Reddy on Crop loss of farmers
నష్టపోయిన రైతులకు చేయాల్సిందంతా చేస్తాం: మంత్రి నిరంజన్‌రెడ్డి
author img

By

Published : Oct 20, 2020, 7:22 AM IST

నిరంజన్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి
  • భారీ వర్షాల వల్ల ఏ మేరకు నష్టం జరిగి ఉంటుంది?

ప్రకృతిని జయించడం మానవులు, ప్రభుత్వాలకు సాధ్యం కాదు. కరోనా, వర్షాలు దీన్ని మరోమారు నిరూపించాయి. ఈ ఏడాది మంచి వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని అనుకున్నాం. కానీ అధిక వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయి. రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. విపత్తు నిర్వహణ కింద అంచనాలు సిద్ధమవుతున్నాయి.

  • పంటనష్టం ఏ మేర జరిగింది. ?

వానాకాలంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అధికవర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని నమోదు చేశాం. పూర్తిగా నష్టపోయిన పంటల కంటె పాక్షికంగా దెబ్బతిన్న పంటలే అధికంగా ఉన్నాయి. పత్తి ఎర్రబారింది. నాలుగైదు రోజులు ఎండలు కాస్తే మామూలు పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆశించిన మేర దిగుబడులు రాకపోవచ్చు. రైతులు ధైర్యంగా ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు కేంద్రంగానే ఆలోచిస్తుంది. కరోనా కష్టకాలంలోనూ రైతులకు అండగా నిలబడింది. ప్రభుత్వ పరంగా రైతులకు చేయాల్సింది అంతా చేస్తాం.

  • కేంద్రం నుంచి ఏ మేరకు సహాయం ఉంటుందని అనుకుంటున్నారు ?

ప్రాథమికంగా ఐదువేల కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా వేశాం... ఈ మేరకు కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిక పంపారు. ఇప్పటికీ కేంద్రం నుంచి ఉలుకూ, పలుకూ లేదు. న్యాయంగా రావాల్సిన జీఎస్టీ నిధుల కోసం కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలి. ఆదుకుంటారన్న ఆశ దురాశ అవుతుందేమో.

  • పంటల కొనుగోళ్లకు సంబంధించి ఏం చెప్తారు. ?

తేమ, నాణ్యతా ప్రమాణాలకు లోబడే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. పత్తి కొనుగోళ్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం పత్తిలో తేమ అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీసీఐ దృష్టికి తీసుకెళ్లాం. నాణ్యత పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశాం. వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వ పరంగా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ, పౌరసరఫరాల, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పూర్తి సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

  • యాసంగి సాగుకు సంబంధించి ఏం చెప్తారు ?

దేశంలో నిల్వలు, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర వచ్చే అవకాశం లేదు. అందుకే మొక్కజొన్న సాగు చేయవద్దని అంటున్నాం. రైతులు కూడా సిద్ధపడ్డారు. స్థానిక నేలలు, వాటి స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఆవాలు తదితర పంటలను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వాటికి అవసరమైన విత్తనాలన్నీ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.