Etela Reaction on Kokapet Land Auction : ధరణి మాటున వేల ఎకరాల పేదల భూమిని బీఆర్ఎస్ సర్కార్ పెద్దలకు కట్టబెడుతోందని బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారని వెల్లడించారు. కేసీఆర్‌కు చట్టసభలపై నమ్మకం సన్నగిల్లిందని.. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11 రోజులు, వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. మొత్తం 2023 సంవత్సరానికి గానూ 14 రోజులు మాత్రమే సభలు జరిగాయని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేవారని ఈటల వివరించారు.
Etela Rajender Latest News : ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలంటే నియోజకవర్గాల్లో ఉంటూ పోలీస్స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారని తెలిపారు. అసెంబ్లీలో నేడు 4 పార్టీలే ఉన్నాయని.. ఉమ్మడి రాష్ట్రంలో 15 రాజకీయ పార్టీలు ఉండేవని గుర్తు చేశారు. అన్ని పార్టీలతో కలిసి బీఏసీ సమావేశం నిర్వహించేవారని వివరించారు. లోక్‌సత్తా పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బీఏసీలో పాల్గొనేవారన్నారు. నేడు జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి (National Political Party BJP) మాత్రం బీఏసీకి ఆహ్వానం ఇవ్వలేదని మండిపడ్డారు.
Etela Rajender Fires on BRS : బీజేపీ సభ్యులకు అసెంబ్లీలో ఒక గది కేటాయించాలని వేడుకున్నా.. పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల వచ్చిన వరదల్లో 41 మంది చనిపోతే.. సభలో కనీసం సంతాపం తెలపలేదని ఆక్షేపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 109 సీట్లు వస్తాయని కేసీఆర్ అహంకారంతో చెబుతున్నారని.. 3 రోజులు సభ జరిగితే.. ఒక రోజు హరీశ్‌రావు, రెండో రోజు కేటీఆర్ (ktr Latest Speech) చివరి రోజు కేసీఆర్ ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందని విమర్శించారు.
"బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు.. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో బడ్జెట్ పెరుగుతుంది.. కానీ కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు చేయడం లేదు. అప్పులు తీసుకుంటున్న మొత్తంలో పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్ వెల్లడించిన విషయాన్ని సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు రూ.13 నుంచి రూ.14 వేల కోట్ల వడ్డీలు పెరిగాయి. ప్రభుత్వ ఖర్చుల్లో ప్రతి నెలా రూ.4 వేల కోట్లు వడ్డీలకే పోతున్నాయి. అలాగే రూ.4 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది. ప్రభుత్వ భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం. ఈరోజు భూములెలా అమ్ముతున్నారు. పరోక్షంగా రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరా రూ.వంద కోట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారు." - ఈటల రాజేందర్, బీజేపీ ప్రచారం కమిటీ ఛైర్మన్
Y Category Security For Etela Rajendar : ఈటలకు 'వై' కేటగిరీ భద్రత.. ఉత్తర్వులు జారీ