bjp leaders: విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పారని.. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. కేంద్రంపై తప్పుడు విమర్శలు చేస్తూ.. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ నమ్మించే ప్రయత్నం చేసినా వారు పట్టించుకునే స్థితిలో లేరన్నారు. నిన్న మోదీ సభకు తరలివచ్చిన జనమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో భాజపా బలపడేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో జాతీయ నేతలు స్పష్టం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తున్నప్పటికి తెలంగాణ ప్రభుత్వం వైఖరి సరిగా లేదని విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు లేక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావడం దారుణమన్నారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పటికీ కేంద్రంలో చక్రం తిప్పుతామనడం హాస్యాస్పదమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
"కేసీఆర్ అడిగిన దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చామో మోదీ చెప్పారు. మొదట సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ హామీలు నేరవేర్చలేక దేశాన్ని కేంద్రంలో చక్రం తిప్పుతామనడం హాస్యాస్పదం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి." - బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
విజయ సంకల్ప సభ విజయవంతం అయిందని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్రమంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శమన్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
'అవును! మాది ఈడీ ప్రభుత్వమే.. నన్ను ట్రోల్ చేసినవారిని..'.. ఫడణవీస్ విక్టరీ స్పీచ్