కరోనా వ్యాప్తి కారణంగా బీఆర్కే భవన్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల సచివాలయ ఉద్యోగి మర్కజ్‌కు వెళ్లిరావడం వల్ల మిగతా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. సదరు ఉద్యోగికి కరోనా నెగెటివ్ రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముందు జాగ్రత్తగా థర్మల్ స్కానర్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ప్రవేశ ద్వారం వద్ద ఒకటి, ఉన్నతాధికారులు వెళ్లే వీఐపీ ప్రవేశ ద్వారం వద్ద మరొక థర్మల్ స్కానర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోజూ విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగుల ఉష్ణోగ్రతలను థర్మల్ స్కానర్ కెమెరాల ద్వారా పరిశీలించనున్నారు.
ఇదీ చూడండి : కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు