వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు యువసేన ఆధ్వర్యంలో లేబర్ కాలనీలో నివాసముంటున్న పేద మహిళలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముఖ్య అతిథిగా హాజరై సరకులను అందించారు.
ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ... సరకులు తీసుకున్నారు. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: కరోనాను మించిన తప్పుడు సమాచార సునామీ