దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర జల శక్తి శాఖ నేతృత్వంలో 'గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్ నిర్వహణ' పై సదస్సు నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. తెలంగాణలో ఇప్పటికే ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందిస్తున్నామని దయాకర్ రావు అన్నారు. 45 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ పథకానికి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని ఈ సదస్సులో కోరినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: స్పీకర్, మండలి ఛైర్మన్‌కు హైకోర్టు నోటీసులు