ఈపీఎఫ్వో పింఛనుదారులు భవిష్యత్తులో లైఫ్ సర్టిఫికెట్ను పొందేందుకు, సమర్పించేందుకు కార్యాలయానికి రావాల్సిన అవసరంలేదని ఈపీఎఫ్వో అధికారులు తెలిపారు. ఏటా సమర్పించాల్సిన లైఫ్ ధ్రువపత్రాలను ఒకసారి సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
కార్యాలయాల వద్ద రద్దీ పెరుగుతున్న కారణంగా.. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సేవలను బ్యాంకులు, మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పొందాలని సూచించారు.
ఇదీ చూడండి: పటాన్చెరులో సీఎం ఓఎస్డీ ఆకస్మిక పర్యటన.. ధరణి పనితీరు పరిశీలన