హైదరాబాద్ ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష మాస్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్, కింగ్ కోఠి, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫౌండేషన్ ఛైర్మన్ జీవీఎస్ రావు మాస్కులు వితరణ చేశారు.
మాస్క్ పెట్టుకోండి ఉచితంగా మజ్జిగ, ఆహారం పొందండి అంటూ వినూత్నంగా అవగాహన కల్పించారు. మాస్కులు ధరించటం వల్ల వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించకుంటే 90 శాతం కొవిడ్ బారిన పడటానికి అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతున్నారు