ETV Bharat / state

సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలో ఆ నాలుగు రోజులు 144 సెక్షన్ అమలు.. - Cyberabad Police 144 section

enforcement-of-section-144-from-1st-to-4th-july-under-cyberabad-commissionerate

author img

By

Published : Jun 29, 2022, 8:04 PM IST

Updated : Jun 29, 2022, 9:06 PM IST

20:01 June 29

Cyberabad Police: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జులై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్ అమలు

Cyberabad Police: హైదరాబాద్​ పర్యటనకు ప్రధాని మోదీ రాక సందర్భంగా నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయస్థాయిలో ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జులై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.

కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టుపక్కల 5 కి.మీ వరకు డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. అలాగే జులై 1 నుంచి 4 వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జులై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడొద్దని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. ఇటీవల సైన్యంలో నియామకాలకు తీసుకొచ్చిన అగ్నిపథ్​కు వ్యతిరేకంగా సికింద్రాబాద్​లో అల్లర్లు చేలరేగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా కాంగ్రెస్ ఆందోళనలకు దిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్​ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే హెచ్​ఐసీసీ ప్రాంగణాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో ఎస్పీజీ అధీనంలోకి తీసుకుంటుందని వెల్లడించారు.

ఇవీ చదవండి:

భాజపా సమావేశాలకు భద్రత కట్టుదిట్టం.. రేపట్నుంటి ఎస్పీజీ అధీనంలోకి హెచ్​ఐసీసీ

'సొంతవాళ్లే మోసం చేశారు!'.. ఉద్ధవ్​ తీవ్ర భావోద్వేగం.. ఇక గుడ్​బై!!

Last Updated : Jun 29, 2022, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.